ఆకాశం వైపు నా కన్ను | Aakasham Vypu | Jesus Song Lyrics | Hosanna Ministries

ఆకాశం వైపు నా కన్ను | Aakasham Vypu | Jesus Song Lyrics | Hosanna Ministries

hosanna ministries,hosanna ministries sunday service,pas.ramesh hosanna ministries,pas freddy paul live,freddy paul pastor,freddy paul hosanna ministries songs 2021,hosanna freddy paul songs,freddy paul pastor messges,hosanna ministries kurnool official,hosanna kurnool,kurnool hosanna ministries,kurnool freddy paul pastor messges,telugu christians messges,freddy paul hosanna ministries,hosanna kurnool live,freddy paul anna testimony,pas john wesley,pas abraham


పల్లవి:
ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను 
            నా సహాయకుడవు నీవే యేసయ్యా (2) 
            కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను (2) 
            కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2)      (ఆకాశం) 

1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది 
    రాజ దండముతో నన్నేలుచున్నది (2) 
    నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి (2) 
    నేనేమైయున్నానో అది నీ కృపయే కదా (2)    (ఆకాశం) 

2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు 
    ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు (2) 
    నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి (2) 
    నీవు ఉండగా ఈ లోకంలో  ఏదియు నాకు అక్కర లేనే లేదయ్యా  (2) (ఆకాశం) 

3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది 
    అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది (2) 
    నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి (2) 
    కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి (2) (ఆకాశం) 

4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది(2)
    భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది (2) 
    పగలు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది (2) (ఆకాశం) 

5. కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు (2) 
    మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా (2) 
    ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య (2) (ఆకాశం)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu