పోస్ట్‌లు

డిసెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పశువుల పాకలో దేవ కుమారుడు | Pashuvula paakalo deva kumarudu | Telugu Christian song lyrics

చిత్రం
పశువుల పాకలో దేవ కుమారుడు | Pashuvula paakalo deva kumarudu | Telugu Christian song lyrics పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి  ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానూలు, పుజించిరి. మనసే పులకించేను క్రీస్తు జన్మతో, తనువే తరియించేను రాజు రాకతో కొనియాడి కీర్తించేదము, పరవశించి ఆరాధించేదం.(2) యుదయ దేశమున, దావీదు పురమందు శ్రీయేసు జనియించే దీనా గర్భమున పరలోకనాధుండు దరణుద్భవించాడు ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు రండి చూడగా వెళ్లేదం, రక్షకుడి భజియించేదం కనరండి కన్య తనయుని కొలిచేదం ఉల్లాసముతో పాడేదం, ఆనందంతో మ్రోకేదం ఆది సంభుతుని అర్భాటించేదం. పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానూలు, పుజించిరి. భోళము సాంబ్రాణి బంగారు కానుకలు సరిరావు ఎన్నటికీ అర్పించు నీ హృదయం అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవ మనుగడకు ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు బలవంతుడు అయినవాడు ఆ మారాజు ఉల్లాసముతో పాడేదం, ఆనందంతో మ్రోకేదం ఆది సంభుతుని అర్భాటించేదం. పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశా...

వెలుగై వచ్చినాడు విశ్వాన్నే ఏలేటోడు | velugai vachinadu vishvane yeletodu | Telugu Christian song lyrics

చిత్రం
వెలుగై వచ్చినాడు  విశ్వాన్నే ఏలేటోడు | velugai vachinadu vishvane yeletodu | Telugu Christian song lyrics "మహ రాజే మహిమను విడిచి - మట్టి మనిషిగా మారాడే మహిలోనా వెలుగులు నింపే - మనుష్య కుమారుడె వచ్చాడే "2 వెలుగై వచ్చినాడు - విశ్వాన్నే ఏలేటోడు దివిలోనా కాంతులు నేడు - నిండెనంట చూడు రక్షణ తెచ్చినాడు రాజుల రారాజే నేడు మిన్నంటే సంబరాలు - ప్రతి మదిలో ఎగసే నేడు మన పాపాలు బాపంగా - దేవుడే దివికి వచ్చాడయ్యా పరలోకానికి చేర్చంగా - మార్గమై తాను నిలిచాడయ్యా "చీకు చింత చితికలు పేర్చి - చలి చలి మంటలు వెయ్యా లా చిన్నా పెద్దా అంతా కలసి - చుట్టు చేరి ఆడాలా.."2" పరలోక మహిమను నాకై - వద్దనుకున్నాడే మట్టి ముద్దనైన నన్ను - మహిమలో చేర్చాడే మోయలేని నా భారమును - ఎత్తుకున్నాడే ప్రాణమే పెట్టి నన్ను - హత్తుకున్నాడే ఆ ప్రేమే వరమై వచ్చే - నా మదిలో తారై నిలిచే చీకట్లను చెరిపే వెలుగై -వాకిట్లో నిలిచేనే.."2" చీకు చింత చితికలు పేర్చి - చలి చలి మంటలు వెయ్యాలా చిన్నా పెద్దా అంతా కలసి - చుట్టు చేరి ఆడాలా..."2" " మహ రాజే మహిమను విడిచి - మట్టి మనిషిగా మారాడే మహి లోనా వెలుగులు న...

యూదయా దేశంలో బెల్లేహేమందు యూదుల రాజు జన్మించేను | Yudaya deshamlo bethlahemamdhu yudhula raju janminchenu | Telugu Christian song lyrics

చిత్రం
యూదయా దేశంలో బెల్లేహేమందు యూదుల రాజు జన్మించేను | Yudaya deshamlo bethlahemdhu yudhula raju janminchenu | Telugu Christian song lyrics పల్లవి: యూదయా దేశంలో బెల్లేహేమందు యూదుల రాజు జన్మించేను ||2||  ఉత్సాహించి సంతోషింతుము|  ఊరంతా చాటి ఆర్బాటింతుము || 2 || || యూదయా || 1. దైవ కుమారుడు జన్మించేను రక్షించుటకు ఇలా ఏతించేను || 2 ||      రండీ....యేసునీ పూజింతుము || 2 ||      బంగారం సాంబ్రాణి బోళముతో కాక ఆ.... కృతజ్ఞతతో పూజింతుము || యూదయా ||  2. చీకటి నిండిన ఈ లోకమును వెలిగించుటకు దర కేతించేను || 2 ||      రండీ....యేసునీ పూజింతుము || 2 ||      బంగారం సాంబ్రాణి బోళముతో కాక ఆ.... పూర్ణమనస్సుతో పూజింతుము || యూదయా || Download Song

యేసయ్య పుట్టాడు విన్నావా నీవు | Yesayya puttadu vinnava nuvu | Telugu Christian song lyrics

చిత్రం
యేసయ్య పుట్టాడు విన్నావా నీవు | Yesayya puttadu vinnava nuvu | Telugu Christian song lyrics పల్లవి: విన్నావా ఓ అన్నా విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు ||2||  మనకోసమే వచ్చాడు - మన అందరి దేవుడు రక్షకుడై పుట్టాడు - రక్షింపగ వచ్చాడు //2// 1. దావీదు పురములో - బేల్లెహేము ఊరిలో మరియమ్మ గర్భనా - యేసయ్య పుట్టాడు //2//  ప్రేమస్వరూపి యేసు- ప్రేమించి వచ్చినాడు //2// 2.  పాపిని రక్షిస్తాడు - ప్రేమను చూపిస్తాడు పరము వీడి వచ్చాడు - పరిశుద్ధుడు యేసు //2//  అందరికి రక్షణనిచ్చి- పరముకు నడిపిస్తాడు //2// Download

రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట | Rajulaku rajanta prabhuvulaku prabhuvanta | Telugu Christian song lyrics

చిత్రం
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట | Rajulaku rajanta prabhuvulaku prabhuvanta | Telugu Christian song lyrics పల్లవి: రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టేనంట సూడ సక్కనోడంట పశువుల పాకలో నంట దావీదు కుమారుడంట లోక రక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులార చూద్దాము .రారండి బాల యేసునీ మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని-2.  ||రాజులకు|| 1.  పాపమంతా బాపునంట దోషమంత మాపునంట కరుణ శీలుడా ఆ యేసు కనికరించే దేవుడంట -2 ఇమ్మానుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్య ఎన్నడు విడువడు ఎడబాయడంట మంచి యేసయ్య -2  ||రాజులకు|| 2.  జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడి రంట బాల యేసు పాద చెంత చేరి స్తుతియించారంట -2 బంగారు సాంబ్రాణి బోళంబులతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంట కొనియాడిన రంట -2  ||రాజులకు||

దేవుడు ఇచ్చిన ఒక బహుమానం నూతనవత్సరమనే కిరీటం | Devudu ichena oka bahumanam nuthanavasaramane kereetam | Telugu Christian song lyrics

చిత్రం
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం నూతనవత్సరమనే కిరీటం | Devudu ichena oka bahumanam nuthanavasaramane kereetam | Telugu Christian song lyrics దేవుడు ఇచ్చిన ఒక బహుమానం నూతనవత్సరమనే కిరీటం "2"   ఉత్సహించి సంతసించెదం ఆనందముతో ఆరాధించెదం "2 " ||దేవుడు ఇచ్చిన|| 1. మరణదూత సంచరించిన వ్యాధులెన్నో చుట్టుముట్టిన  "2"   కాపాడెను ప్రభువు తనకృపలో కాచెను గతకాలం కంటిపాపలా "2"   ||దేవుడు ఇచ్చిన|| 2. కరువుకాటకాలెదురైన బ్రతుకుదెరువు కోల్పోయిన  "2"  పోషించెను ప్రభువు తన కృపలో సమృద్ధినిచ్చెను ప్రతిస్థితిలో  "2" ||దేవుడు ఇచ్చిన|| 3."సంవత్సరమంత నీ కృపలో మమ్ము కాయుము ఓ ప్రభువ  "2" ఇమ్మానుయేలుగ మా కాపరివై నడిపించుము ఓ దేవా నీ దయతో "2 " ||దేవుడు ఇచ్చిన|| Download song

దయాకిరీటము ధరియింపచేసి నూతన సృష్టిగ నను మార్చినావు | Dhayakeereetamu dhariyimpajesi nuthana srustiga nanu marchinaavu | Telugu Christian song lyrics

చిత్రం
దయాకిరీటము ధరియింపచేసి  నూతన సృష్టిగ నను మార్చినావు | Dhayakeereetamu dhariyimpajesi nuthana srustiga nanu marchinaavu | Telugu Christian song lyrics దయాకిరీటము ధరియింపచేసి నూతన సృష్టిగ నను మార్చినావు గడిచిన కాలమంతా కాపాడినావు మహిమ కిరీటము ధరియింపచేసి నీ కృపా నన్ను విడువలేదయా నీ ప్రేమా నన్ను మరువలేదయా - 2 యాహ్వే ఏర్ఘడ్డాయి - యేషువా నీకే స్తోత్రము - 2 1. నాపై నీ తలంపులన్ని ఎంతో మహనీయము నా ఊహకందని ఎతైన శిఖరములు -2 నూతన గీతం పాడి జయ ధ్వనులతో నిన్ను కీర్తించ సేవించెదా నిన్నే - ఆరాధించెద కొనియాడెదా నిన్నే ప్రేమించెదా (యాహ్వేా) 2. నాకై నీ వాగ్దానములు ఎంతో అమూల్యములు  నా జీవిత యాత్రలో నమ్మదగిన మాటలు - 2 నూతన గీతం పాడి జయ ధ్వనులతో నిన్ను కీర్తించి సేవించెదా నిన్నే - ఆరాధించెద కొనియాడెదా నిన్నే - ప్రేమించెదా (యాహ్వే ) Download Song

క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా | kotha samvasaram dayachesina yesayya | Telugu Christian song lyrics

చిత్రం
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా  | kotha samvasaram dayachesina yesayya | Telugu Christian song lyrics క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా సరిక్రొత్త మనస్సును మాకిచ్చిన యేసయ్యా "2" నీ దయ కిరీటం మామీద వుంచినావయ్యా "2"  వందనం వందనం వందనం యేసయ్య స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా "2"                                                                                                                               ||క్రొత్త సంవత్సరం||   1. గడచిన కాలంలో మావెంటే వున్నావు విడువక మాతోడై మము నడిపించావు "2"  ఎన్నో కార్యాములు మాపైన చేసావు కంటికి రెప్పవలె కాపాడినావు నీదయ దీవెనలు గత కాలమంతా కుమ్మరించావు "2"  వందనం వందనం వందనం యేసయ్య స్తోత్రము స్తోత్రము స్తోత్రము...

సంతోషమే నా యేసునిలో | santhoshame naa yesunelo | Telugu Christian song lyrics

చిత్రం
సంతోషమే నా యేసునిలో | santhoshame naa yesunelo | Telugu Christian song lyrics సంతోషమే.. నా యేసునిలో నిత్యానందమునిచ్చు నాధునీలో...2 మనసంతా సంతోషం.. -2 ఆత్మలో ఆనందం.. యేసయ్య. అది దొరికెను నీలో సంతోషమే నా యేసునిలో నిత్యానందమునిచ్చు నాధునీలో...2 1.శ్రమలలో నీ మాటా, కలిగించే ఆనందమే దుక్కములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే -2 వ్యథయినా బాధయినా నను వీడిపోడు కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు వ్యథయినా మరి భాదయినా నను వీడిపోడు  కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు నను ప్రేమించే నా దేవుడు నను రక్షించే నా నాధుడు 2.ఏమున్న లేకున్న నీవున్న చాలంతే ఇచ్చువాడవు నీవే పోషించువాడవు నీవే -2 నా ప్రాణం సర్వస్వమ్ నీవేగా యేసయ్య నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్య -2 బ్రతుకంతా నీలోనే యేసయ్య.. ఆ  చావైతే నీకొరకే యేసయ్య Download Song

యేసు దేవుని ఆశ్రయించుమా | yesu devuni asrayimchuma | Telugu Christian song lyrics

చిత్రం
యేసు దేవుని ఆశ్రయించుమా | yesu devuni asrayimchuma | Telugu Christian song lyrics యేసు దేవుని ఆశ్రయించుమా - సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా - గొప్ప కార్యాలు జరుగును నీ యేదుటే స్వస్థత లేక... సహాయము లేక... సాలియావా ? యేసు నామములోనే స్వస్థతే - యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన - యేసే నడిపించును జీవమారాన 1.రోగియైన దాసుని కొరకు - శతాధిపతి యేసు ప్రభుని మాట మాత్రం సెలవిమ్మనగా -విశ్వసించిన ప్రకారమే వేడుకొనెను స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును ||2|| యేసు నందు విశ్వాసముంచుము 2 దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను - దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను నీవు అడుగుము నీకివ్వబడును ||2|| యేసుని ప్రార్థించుము 3.శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా యధారత నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను సహసము చూపుము సమకూడి జరుగును ||2|| యేసు నందు నిరీక్షించుము. Download Song

నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు | Nee kantipaapanu NAA kantaneeru chudalevu | Telugu Christian song lyrics

చిత్రం
నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు | Nee kantipaapanu NAA kantaneeru chudalevu | Telugu Christian song lyrics  నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో యేసయ్యా... యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా   నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా 1.  కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా || 2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం || యేసయ్యా || 3. నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు  ||యేసయ్యా || Download Song

చింతలేదిక యేసుబుట్టెను వింతగను బెత్లెహెమందున | Chintaladheka yesu putte I vinthaganu bethlahemandhuna | Telugu Christian song lyrics

చిత్రం
చింతలేదిక యేసుబుట్టెను వింతగను బెత్లెహెమందున | Chintaladheka yesu putte I vinthaganu bethlahemandhuna | Telugu Christian song lyrics చింతలేదిక యేసుబుట్టెను వింతగను బెత్లెహెమందున చెంతజేరను రండి సర్వజనా౦గమా సంతసమొందుమా 1. దూత తెల్పెను గొల్లలకు శుభ – వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి – స్తుతులోనరించిరి 2. చుక్క గనుగొని జ్ఞానులెంతో మక్కువతో – నా ప్రభుని గనుగొన చక్కగా బెత్లెము పురమున జొచ్చిరి – కానుక లిచ్చిరి 3. కన్య గర్భమునందు బుట్టెను – కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమె దీనులై – సర్వ మాన్యులై 4. పాపమెల్లను పరిహరింపను – పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గడు భాగ్యము – మోక్ష భాగ్యము      

బెత్లహేములోనంట సందడి | Bethlahemulonanta sandadi | Telugu Christian song lyrics

చిత్రం
బెత్లహేములోనంట సందడి | Bethlahemulonanta sandadi | Telugu Christian song lyrics  బెత్లహేములోనంట – సందడి   పశువుల పాకలో – సందడి దూతలు వచ్చేనంట – సందడి  పాటలు పాడేనంట – సందడి /2/  రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/ చేసారంట సందడే  సందడి చేయబోదాము సందడే సందడి /2/ Happy Happy.. Happy Happy Christmas Christmas Wish you a Happy Christmas Merry Merry Christmas Christmas Wish you a Merry Christmas అర్దరాత్రి వేళలో – సందడి దూతలు వచ్చేనంట – సందడి రక్షకుడు పుట్టేనని – సందడి వార్తను తెలిపేనంట – సందడి /2/  రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి /2/ చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి చేసారంట సందడే  సందడి – చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే! Happy Happy.. Happy Hap...

బేత్లెహేములో సందడి పశుల పాకలో సందడి | Bethlahemulo sandadi pashula paakalo sandadi | Telugu Christian song lyrics

చిత్రం
బేత్లెహేములో సందడి  పశుల పాకలో సందడి | Bethlahemulo sandadi pashula paakalo sandadi | Telugu Christian song lyrics బేత్లెహేములో సందడి – పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని – మహారాజు పుట్టాడని  /బేత్లెహేములో/ 1.ఆకాశములో సందడి – చుక్కలలో సందడి /2/ వెలుగులతో సందడి – మిలమిల మెరిసే సందడి  /2/ బేత్లె/ 2.దూతల పాటలతో సందడి – సమాధాన వార్తతో సందడి /2/ గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి /2/ బేత్లె/ 3.దావిదు పురములో సందడి – రక్షకుని వార్తతో సందడి /2/ జ్ఞానుల రాకతో సందడి – లోకమంతా సందడి /2/ బేత్లె/

బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి | Bethlahemu puramulo oka naati rateri | Telugu Christian song lyrics

చిత్రం
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి | Bethlahemu puramulo oka naati rateri | Telugu Christian song lyrics బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి, ఊహలకు అందని అద్భుతము జరిగెను! లోక చరిత మార్చిన దైవకార్యము, కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను! అహహ్హ ఆశ్చర్యము, ఓహోహో ఆనందము; రారాజు యేసు క్రీస్తు ని జననము అహహ్హ ఏమా దృశ్యము, ఓహొహ్హో ఆ మహత్యము; సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము! 1.ధన్యులం, దీ/హీనులం మనము ధన్యులం, దైవమే మనల కోరి దరికి చేరెను మనిషిగా, మన మధ్య చేరే దీన జన్మతో, పశువుల తోట్టెలోన నిదుర చేసెను అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు, మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి 2.పుట్టెను, యూదులకు రాజు పుట్టెను వెతికిరి, ఆ రాజు జాడ కొరకు వెతికిరి నడిపెను ఆకశాన తార కనపడి నిలిచెను, యేసు ఉన్న చోటు తెలిపెను తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు, యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి 3.దొరికెను, రక్షకుడు మనకు దొరికెను తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను యేసుని రూపమే మనకు సాక్షము యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం; నింపెను నిరీక్షణ కృపయు సమాధానము.

బేధం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు | bedham ami ladhu andharunu papam chesiyunaaru | Telugu Christian song lyrics

చిత్రం
బేధం ఏమి లేదు  అందరును పాపం చేసియున్నారు | bedham ami ladhu andharunu papam chesiyunaaru | Telugu Christian song lyrics బేధం ఏమి లేదు! – అందరును పాపం చేసియున్నారు,  దేవాదిదేవుడు ఇచ్చే ఉన్నత మహిమను – పోగొట్టుకున్నారు /2/ ఏ కులమైన మతమైన జాతైన రంగైన – దేవుని దృష్టిలో అందరు పాపులే /2/బేధం/ 1. ఆస్తి పాస్తులు ఎన్నున్నా – నిత్యరాజ్యము నీకివ్వవు  విద్యార్హతలు ఎన్నున్నా – సంతోషాన్ని నీకివ్వవు  సమసిపోయే ఈలోకము – ఆశ్రయాన్ని నీకివ్వదు  తరిగిపోయే ఈ కాలము – కలవరాన్ని తీర్చదు  నీవేవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా  యేసులేకుంటే నీకున్నవన్ని సున్న /2/బేధం/ 2. పుణ్యకార్యాలు చేసినా – పవిత్రత నీకు రాదుగా  తీర్ధ యాత్రలు తిరిగినా – తరగదు నీ పాపము  పరమును వీడిన పరిశుద్ధుడేసు – రక్తము కార్చెను సిలువలో  కోరికోరి నిను పిలిచెను – పరమ రాజ్యము నీకివ్వగ  నీ స్థితి ఏదైనా – గతి ఏదైనా వృత్తేదైనా భ్రుతి ఏదైనా  కలువరి నాధుడే రక్షణ మార్గము /2/బేధం/  

పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి నాకోసమోచ్చావయ్యా | Papani bapeti shapaani bapeti nakosamochavayya | Telugu Christian song lyrics

చిత్రం
పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి నాకోసమోచ్చావయ్యా | Papani bapeti shapaani bapeti nakosamochavayya | Telugu Christian song lyrics  పాపాన్ని బాపేటి – శాపాన్ని బాపేటి – నాకోసమోచ్చావయ్యా  కష్టాల్ని తీర్చేసి – నష్టాన్ని ఒర్చేసి – నాకోసమోచ్చావయ్యా   కన్నీటిని తుడిచావయ్యా -సంతోషాన్ని ఇచ్ఛావయ్యా  మనుషులను చేశావయ్యా – నీ రూపాన్ని ఇచ్చావయ్యా    నా యేసయ్యా – నా యేసయ్యా /2/   రక్షణను అందించి – రక్తాన్ని చిందించి – మోక్షాన్ని ఇచ్చావయ్యా  ధనవంతులుగా మమ్ములను చేయంగ – దారిద్ర్యమొందావయ్యా /2/కన్నీటిని/   బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు – హృదయాన్ని అడిగావయ్యా  ఆస్తుల్ని అడుగలేదు అంతస్తులడుగలేదు – నాకోసమొచ్చావయ్యా /2/కన్నీటిని/ 

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు | Baludu kadhammo balavanthudu Yesu Pasivadukadhammo paramathmudu Kristhu | Telugu Christian song lyrics

చిత్రం
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు | Baludu kadhammo balavanthudu Yesu Pasivadukadhammo paramathmudu Kristhu | Telugu Christian song lyrics  బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు  /2/ పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా /2/ బాలుడు/ 1.కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా  ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకను చేరామే/2/ మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము /2/  మా మంచి కాపరని సంతోషించామే!  సందడి సందడి సందడి సందడి సందడి చేసామే /4/బాలుడు/ 2.చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
 పరిశుద్ధుని చూసి పరవశించామే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా /2/ బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము /2/ ఇమ్మానుయేలని పూజించామమ్మో సందడి సందడి సందడి సందడి సందడి చేసామే  /4/బాలుడు/  

అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా | Avatarinchina deva adyantamu lenivaada | Telugu Christian song lyrics

చిత్రం
అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా | Avatarinchina deva adyantamu lenivaada | Telugu Christian song lyrics  అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా  అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2// అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా  అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2// నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో  క్రీస్తు దేవా మహా రాజా – విస్తార యశశోభిత  1. వున్నవాడనేవాడ అన్నీ సృజించినవాడా  నన్ను మమ్ములనందరిని – మన్నాతో పోషించేవాడా//2// మన్నాతో పోషించేవాడా..   నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో  క్రీస్తు నాధా కృపా సింధు- దేవ పుత్ర విమోచక  2. కాపరివై కాచేవాడ – పాపము తొలగించేవాడ  సైతానును జయించినవాడా – మృతులను బ్రతికించేవాడా //2// మృతులను బ్రతికించేవాడా..  నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో రాజ రాజా మహా తేజ – తేజోమయ పరమాత్మ దేవా  అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా  అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2// అవతరించిన దేవా… 

అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ | Andaru mechhina andaala taara Avaniki techhenu velugula meda | Telugu Christian song lyrics

చిత్రం
అందరు మెచ్చిన అందాల తార  అవనికి తెచ్చెను వెలుగుల మేడ | Andaru mechhina andaala taara avaniki techhenu velugula meda | Telugu Christian song lyrics అందరు మెచ్చిన అందాల తార  అవనికి తెచ్చెను వెలుగుల మేడ /2/ ( Christmas Happy Christmas Happy Happy Christmas Christmas Merry Christmas Merry Merry Christmas ) X 2 1. సృష్టి కర్తయే మరియ తనయుడై  పశుల పాకలో పరుండినాడు /2/ నీతి జీవితం నీవు కోరగా – నీకై రక్షణ తెచ్చినాడు /2/ నీకై రక్షణ తెచ్చినాడు.. 2. ఇంటిని విడిచి తిరిగిన నాకై  ఎదురు చూపులే చూచినాడు /2/ తప్పును తెలిసి తిరిగి రాగా  క్షమియించి కృప చూపినాడు /2/ ఎన్నో వరములు ఇచ్చినాడు .. 3. పాత దినములు క్రొత్తవి చేసి  నీలో జీవము నింపుతాడు /2/ కటిక చీకటి వేకువ కాగా  అంబరమందు సంబరమాయె /2/ హృదయమునందు హాయి నేడు..