నీ వాక్యమే నన్ను బ్రతికించెను | nee vaakayame nannu brthikinchenu song lyrics Download
నీ వాక్యమే నన్ను బ్రతికించెను | nee vaakayame nannu brthikinchenu Telugu Christian song lyrics Download నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమైయున్న యేసు వందనమయ్యా ||నీ వాక్యమే|| 1. జిగటగల ఊచి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను ||నీ వాక్యమే|| 2. వాడిగల రెండంచుల ఖడ్గమువలెను నాలోని సర్వమును విభజించి శోధించి పాప మాలిన్యము తొలగించి వేయుచు అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది ||నీ వాక్యమే|| 3. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ||నీ వాక్యమే|| 4. పాలవంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్న కోరదగినది ||నీ వాక్యమే|| Download song Lyrics pdf