అదిగో వచ్చాడయ్య యేసు మన ప్రాణాల తోడు | Adigo vochadhaya yesu mana pranala thodu telugu christian song lyrics

అదిగో వచ్చాడయ్య యేసు  మన ప్రాణాల తోడు | Adigo vochadhaya yesu mana pranala thodu telugu christian song lyrics


అదిగో వచ్చాడయ్య యేసు  మన ప్రాణాల తోడు | Adigo vochadhaya yesu mana pranala thodu telugu christian song lyrics



నాలుగు దిక్కులు చీకటి చీల్చి
భూమిని రంగుల బంతిగ మార్చి
చిక్కులు తీర్చగ చేతులు చాచి
చుక్కల దారిన నేలకు వచ్చి
కన్నీల చూపును కాంతిగ మలిచి
కష్టాల దారికి కాపుగ నిలిచి
మాములు మనిషిగ లోకుల కాచి


Chorus:
"అదిగో వచ్చాడయ్య యేసు
మన ప్రాణాల తోడు"||2||
అదిగో వచ్చాడంట చూడు
తనలాంటోడు లేడు
మన చీకట్లనే యేరు వాకిట్లో తెల్లారు
వెలుగళ్ళే వేంచేసినాడు


చుక్కలనుండి దిక్కులదాక
తానే ఉన్నాడు
వంచన తుంచి మంచిని పెంచే
మారాజయ్యాడు
ఎండలలోనే వెన్నెల్ల పూసే
గొడుగై వస్తాడు
ఆపదలోనే అండగ వచ్చి
గుండెల నిండుగ పండగ తెచ్చి||అదిగో||


1.ఈ మట్టినే మార్చావుగా - నీ నామముండే పరలోకమై
నీ నెత్తురే పంచావుగా - పాపాలు మాపే పరమాత్మవై
శిరి వెన్నెల్లు చూసాక నీ రూపునా
మా కన్నుల్లో కడతేరె ఆవేదన
ఎంత కారుణ్యమో ఉంది నీ పేరునా
తప్పు మన్నించి దయ చూపు నీ లాలన
నీ మార్గాన్ని దరిచేరి శరనందున
నీ కృపతోనే ఇకపైన జీవించిన ||చుక్కలనుండి||
                                                ||అదిగో||


2.ఆ పువ్వులు మా నవ్వులు - నీ రాకతో పూసాయి
నీ చూపులో మా రాతలు - మార్చేసి మళ్ళీ రాశావిలా
నిత్యజీవాన్ని కరుణించు నీ తోడునా
నువ్వు ఎడబాటు కాకుండ మా బ్రతుకున
ఎన్ని కష్టాలు మోసావో మా వంతునా
నా నేమిచ్చి తీర్చాలి నీ రుణమిల
దైవమే కోరి పంపింది ఈ దీవెన
అందుకున్నాము నీ ప్రేమలో పాలన ||చుక్కలనుండి||

                                                         ||అదిగో||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu