కృపా క్షేమము నీ శాశ్వత జీవము | Krupa Kshemamu Telugu christian song Lyrics Download

కృపా క్షేమము నీ శాశ్వత జీవము | Krupa Kshemamu Telugu Christian song Lyrics Download

కృపా క్షేమము నీ శాశ్వత జీవము | Krupa Kshemamu Telugu Christian song Lyrics Download


కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవితకాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే       ||కృపా క్షేమము||

2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవం
'పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
'కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే      ||కృపా క్షేమము||

3. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకు కల పండుగ
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే      ||కృపా క్షేమము||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu