నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు | NEE KANTIPAPANU Telugu Christian song Lyrics
Album/Song: NEE KANTIPAPANU YESAYYA
Lyrics & Produced: Bro. Joshua Shaik.
Sung by : Sharon sister
నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా
1. కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు
విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా ||
2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం || యేసయ్యా ||
3. నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు || యేసయ్యా ||
