ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు | Yepati Dhananaya Nannithaga heichinchutaku telugu christian song lyrics
ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు | Yepati Dhananaya Nannithaga heichinchutaku telugu christian song lyrics
Album: Sarvonnatha
Lyrics: Pastor D.Chrisostam
ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు -
నేనంతటి దాననయ నాపై కృప చూపుటకు ||2||
నా దోషము భరించి నా పాపము క్షమించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ||2|| ||ఏపాటి దాననయ||
1.కష్టాల కడలిలో కన్నీటి లోయలలో -
నా తోడు నిలిచావు నన్నాదరించావు ||2||
అందరు నను విడచిన నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే||
2.నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా -
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత ||2||
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ||ప్రేమించే||
