చూచుచున్నాము నీ వైపు | Choochu Chunnamu Nee Vaipu telugu christian song Lyrics
చూచుచున్నాము నీ వైపు | Choochu Chunnamu Nee Vaipu Telugu christian song Lyrics
చూచుచున్నాము నీ వైపు - మా ప్రియ జనక - చూచుచున్నాము నీ వైపు = చూచుచు నీ ప్రేమ - సొంపుసువార్తను - జాచుచు గరములు చక్కగా నీవైపు
||చూచు||
1.మేమరులమై యుంటిమి-మార్గము వీడి - మేమందరము పోతిమి = ప్రేమచే నప్పుడు - ప్రియ తనయు నంపించి - క్షేమ మార్గము మాకు - బ్రేమను జూపితివి ||చూచు||
2.నిన్ను నమ్ము పాపులకు - వారెవ రైన - నీ శరణుజొచ్చువారలకు ఇనుడవు కేడెంబు - నీ జగతిలో నగుచు - గనుపరచు చుందువు - ఘన మైన నీ కృప
||చూచు||
3.నీ భయము మాయెదలను - నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను = నీ భయముచే మేము - వైభవ మొందుచు -నే భయము లేకుండ - నీ భూవిని గొన్నాళ్లు ||చూచు||
4.దయజూచి మము నెప్పుడు - మంచివి యన్ని - దయచేయు మెల్లపుడు = దయచేయరానివి దయచేయుమని కోర -దయజూపి మన్నించు - దయగల మా తండ్రి ||చూచు||
