నీ వాక్యమే నన్ను బ్రతికించెను | nee vaakayame nannu brthikinchenu song lyrics Download

నీ వాక్యమే నన్ను బ్రతికించెను  | nee vaakayame nannu brthikinchenu Telugu Christian song lyrics Download

 నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను 

కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా 

వాక్యమైయున్న యేసు వందనమయ్యా  ||నీ వాక్యమే||


1.జిగటగల ఊచి నుండి లేవనెత్తెను 

సమతలమగు భూమిపై నన్ను నిలిపెను 

నా పాదములకు దీపమాయెను 

సత్యమైన మార్గములో నడుపుచుండెను ||నీ వాక్యమే||


2.వాడిగల రెండంచుల ఖడ్గమువలెను 

నాలోని సర్వమును విభజించి శోధించి 

పాప మాలిన్యము తొలగించి వేయుచు 

అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది ||నీ వాక్యమే||


3.శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై 

యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది 

అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె 

అడ్డుకొని ఆర్పివేయుచున్నది ||నీ వాక్యమే||


4.పాలవంటిది జుంటె తేనె వంటిది

నా జిహ్వకు మహా మధురమైనది 

మేలిమి బంగారు కన్న మిన్నయైనది.

రత్నరాసుల కన్న కోరదగినది  ||నీ వాక్యమే||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu