నడిపించు నానావ - నడిసంద్రమున దేవా | Nadipinchu Naa Naava song lyrics telugu Download

నడిపించు నానావ - నడిసంద్రమున దేవా | Nadipinchu Naa Naava song lyrics telugu Download 

నడిపించు నానావ - నడిసంద్రమున దేవా | Nadipinchu Naa Naava song lyrics telugu Download

Song Name: నడిపించు నా నావా

Lyrics : A.B MASILAMANI

నడిపించు నా నావా – నడి సంద్రమున దేవా

నవ జీవన మార్గమున  – నా జన్మ తరియింప       ||నడిపించు||


1.నా జీవిత తీరమున నా అపజయ భారమున

నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు

నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప

నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము         ||నడిపించు||


2.రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము

రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము

రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో

రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ           ||నడిపించు||


3.ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి

అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి

ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే

ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు                ||నడిపించు||


4.ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని

ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని

ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది

ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట          ||నడిపించు||


5.లోతైన జలములలో లోతున వినబడు స్వరమా

లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి

లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు

లోపించని అర్పనగా లోకేష చేయుమయా            ||నడిపించు||


6.ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని

ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ

పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో

ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు        ||నడిపించు||


Click Here to Download Pdf


If Notice any Spelling Mistakes Please Comment in the comment box Thank you!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu