బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు | Baludu kadhammo balavanthudu Yesu Pasivadukadhammo paramathmudu Kristhu | Telugu Christian song lyrics

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు | Baludu kadhammo balavanthudu Yesu Pasivadukadhammo paramathmudu Kristhu | Telugu Christian song lyrics 

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు  /2/

పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా /2/ బాలుడు/

1.కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా

 ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకను చేరామే/2/

మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము /2/ 

మా మంచి కాపరని సంతోషించామే! 

సందడి సందడి సందడి సందడి సందడి చేసామే /4/బాలుడు/

2.చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
 పరిశుద్ధుని చూసి పరవశించామే

రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా /2/

బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము /2/

ఇమ్మానుయేలని పూజించామమ్మో

సందడి సందడి సందడి సందడి సందడి చేసామే  /4/బాలుడు/  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu