బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి | Bethlahemu puramulo oka naati rateri | Telugu Christian song lyrics

బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి | Bethlahemu puramulo oka naati rateri | Telugu Christian song lyrics



బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి,

ఊహలకు అందని అద్భుతము జరిగెను!

లోక చరిత మార్చిన దైవకార్యము,

కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను!

అహహ్హ ఆశ్చర్యము, ఓహోహో ఆనందము;

రారాజు యేసు క్రీస్తు ని జననము

అహహ్హ ఏమా దృశ్యము, ఓహొహ్హో ఆ మహత్యము;

సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము!

1.ధన్యులం, దీ/హీనులం మనము ధన్యులం,

దైవమే మనల కోరి దరికి చేరెను

మనిషిగా,మన మధ్య చేరే దీన జన్మతో,

పశువుల తోట్టెలోన నిదుర చేసెను

అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు,

మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి

2.పుట్టెను, యూదులకు రాజు పుట్టెను

వెతికిరి,ఆ రాజు జాడ కొరకు వెతికిరి

నడిపెనుఆకశాన తార కనపడి

నిలిచెను,యేసు ఉన్న చోటు తెలిపెను

తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు,

యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి

3.దొరికెను, రక్షకుడు మనకు దొరికెను

తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను

దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను

యేసుని రూపమే మనకు సాక్షము

యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం;

నింపెను నిరీక్షణ కృపయు సమాధానము.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu