ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
చింతలేదిక యేసుబుట్టెను వింతగను బెత్లెహెమందున | Chintaladheka yesu putte I vinthaganu bethlahemandhuna | Telugu Christian song lyrics
చింతలేదిక యేసుబుట్టెను వింతగను బెత్లెహెమందున | Chintaladheka yesu putte I vinthaganu bethlahemandhuna | Telugu Christian song lyrics
చింతలేదిక యేసుబుట్టెను వింతగను బెత్లెహెమందున
చెంతజేరను రండి సర్వజనా౦గమా సంతసమొందుమా
1. దూత తెల్పెను గొల్లలకు శుభ – వార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి – స్తుతులోనరించిరి
2. చుక్క గనుగొని జ్ఞానులెంతో మక్కువతో – నా ప్రభుని గనుగొన
చక్కగా బెత్లెము పురమున జొచ్చిరి – కానుక లిచ్చిరి
3. కన్య గర్భమునందు బుట్టెను – కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమె దీనులై – సర్వ మాన్యులై
4. పాపమెల్లను పరిహరింపను – పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గడు భాగ్యము – మోక్ష భాగ్యము