క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా | kotha samvasaram dayachesina yesayya | Telugu Christian song lyrics
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా | kotha samvasaram dayachesina yesayya | Telugu Christian song lyrics
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా సరిక్రొత్త మనస్సును మాకిచ్చిన యేసయ్యా "2"
నీ దయ కిరీటం మామీద వుంచినావయ్యా "2"
వందనం వందనం వందనం యేసయ్య స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా "2"
||క్రొత్త సంవత్సరం||
1. గడచిన కాలంలో మావెంటే వున్నావు విడువక మాతోడై మము నడిపించావు "2"
ఎన్నో కార్యాములు మాపైన చేసావు కంటికి రెప్పవలె కాపాడినావు నీదయ దీవెనలు గత కాలమంతా కుమ్మరించావు "2"
వందనం వందనం వందనం యేసయ్య స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా "2"
|| క్రొత్త సంవత్సరం||
2. చేసిన పాపములో నీరక్తము కార్చావు ఎండిన బ్రతుకులలో నీజీవము పోసావు "2"
శత్రువులపై విజయమును నిచ్చావు మరణము నుండి తప్పించినావు "2"
నీకృప క్షేమములు మాకు తోడుగా వుంచినావు "2"
వందనం వందనం వందనం యేసయ్య స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా "2"
||క్రొత్త సంవత్సరం||
Download Song