శ్రీ యేసుండు జన్మించె రేయిలో | Sri yasundu janminchea reyelo song lyrics telugu
శ్రీ యేసుండు జన్మించె రేయిలో | Sri yasundu janminchea reyelo telugu christian song lyrics free download
శ్రీ యేసుండు జన్మించె రేయిలో - నేడు - పాయక బెల్లెహేమ యూరిలో
1.కన్నియ మరియమ్మ గర్భమందున - ని - మ్మాను యేలనెడి నామమందున
||యేసుండు||
2.సత్ర మందున బశువుల సాలయందున - దేవ - పుత్రుండు మనుజుండాయై నందున
||యేసుండు||
3.పట్టి పొత్తి గుడ్డలు జుట్టబడి -పసుల-తొట్టిలో పరుండ బెట్ట బడి
||యేసుండు||
4.గొల్లలెల్లరు మిగుల భీతిల్లగ - దెలపే గొప్ప వార్త దూత చల్లగ
||యేసుండు||
5.మన కొఱకొక్క శిశువు పుట్టెను - ధరను - మన దోషముల బోగొట్టను
||యేసుండు||
6.పరలోకపు సైన్యంబు గూడెను - మింట - వర రక్షకుని గూర్చి పాడెను
||యేసుండు||
7.అక్షయుండగు యేసు వచ్చెను - మనకు - రక్షణంబు సిద్ధపర్చెను
||యేసుండు||
