వెలుగై వచ్చినాడు విశ్వాన్నే ఏలేటోడు | velugai vachinadu vishvane yeletodu | Telugu Christian song lyrics
వెలుగై వచ్చినాడు విశ్వాన్నే ఏలేటోడు | velugai vachinadu vishvane yeletodu | Telugu Christian song lyrics
"మహ రాజే మహిమను విడిచి - మట్టి మనిషిగా మారాడే మహిలోనా వెలుగులు నింపే - మనుష్య కుమారుడె వచ్చాడే "2
వెలుగై వచ్చినాడు - విశ్వాన్నే ఏలేటోడు దివిలోనా కాంతులు నేడు - నిండెనంట చూడు రక్షణ తెచ్చినాడు రాజుల రారాజే నేడు మిన్నంటే సంబరాలు - ప్రతి మదిలో ఎగసే నేడు మన పాపాలు బాపంగా - దేవుడే దివికి వచ్చాడయ్యా పరలోకానికి చేర్చంగా - మార్గమై తాను నిలిచాడయ్యా
"చీకు చింత చితికలు పేర్చి - చలి చలి మంటలు వెయ్యా లా చిన్నా పెద్దా అంతా కలసి - చుట్టు చేరి ఆడాలా.."2"
పరలోక మహిమను నాకై - వద్దనుకున్నాడే మట్టి ముద్దనైన నన్ను - మహిమలో చేర్చాడే మోయలేని నా భారమును - ఎత్తుకున్నాడే ప్రాణమే పెట్టి నన్ను - హత్తుకున్నాడే ఆ ప్రేమే వరమై వచ్చే - నా మదిలో తారై నిలిచే చీకట్లను చెరిపే వెలుగై -వాకిట్లో నిలిచేనే.."2"
చీకు చింత చితికలు పేర్చి - చలి చలి మంటలు వెయ్యాలా చిన్నా పెద్దా అంతా కలసి - చుట్టు చేరి ఆడాలా..."2"
" మహ రాజే మహిమను విడిచి - మట్టి మనిషిగా మారాడే మహి లోనా వెలుగులు నింపే - మనుష్య కుమారుడె వచ్చాడే "2
పశువుల పాకలో - పవళించ దలిచాడే రిక్తునిగా చేసికొని - తగ్గించుకున్నాడే చీకటి నిండిన లోకంలో - వెలుగై వచ్చాడే పాపినైన నాకు - నిత్యజీవమునిచ్చాడే ఆ ప్రేమే యేసుగ వచ్చే - నా బ్రతుకులో నెమ్మదినిచ్చే ఇమ్మానుయేలుగా నాతో - ఎల్లప్పుడు నిలిచేనే.."2"
చీకు చింత చితికలు పేర్చి - చలి చలి మంటలు వెయ్యాలా చిన్నా పెద్దా అంతా కలసి - చుట్టు చేరి ఆడాలా..”4*
