బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | brathuku dhinamulu lekimpa nerpumu | Telugu Christian song lyrics

బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | brathuku dhinamulu lekimpa nerpumu | Telugu Christian song lyrics



బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము నా దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము


ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ


నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu