పనికిరాని పాత్రనని పారవేయకుమా | panikiraani paatranani paaraveyakumaa | Telugu Christian song lyrics

పనికిరాని పాత్రనని  పారవేయకుమా | panikiraani paatranani paaraveyakumaa | Telugu Christian song lyrics



పనికిరాని పాత్రనని - పారవేయకుమా 

పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2) 

సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ

సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి 

ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి


కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా

 ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా


1.విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు

వెలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2) 

ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా 

పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా

||కుమ్మరి||



2.లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ 

మనుషేచ్చలన్నియు స్టిరమనుచునే- మనశ్శాంతి కోల్పోతిని (2)

పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి

ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిన్

ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్


కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి 

జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా

ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా (2)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu