నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా | Nannu Diddumu Chinna Prayamu - Sannuthundagu Nayana Song Lyrics Telugu
నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా | Nannu Diddumu Chinna Prayamu - Sannuthundagu Nayana Song Lyrics Telugu
Lyrics: M.Devadasu Ayyagaru
నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను|| మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను|| ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను|| వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||