రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ | RaRaju puttadoi - Maaraju puttadoi Song Lyrics Telugu | Christmias songs lyrics 2021

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ | RaRaju puttadoi - Maaraju puttadoi Song Lyrics Telugu


Lyrics: Joshua Shaik

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ 

సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ 


ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్

మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్


నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే

సంబరమాయెనే, హోయ్ ...


1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట

ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు 


కన్నుల విందుగా దూతలు పాడగా 

సందడే సిందేయంగా మిన్నుల పండగ 


సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట

పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట

చెరగని స్నేహమై .....


2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు 

మనసులో దీపమై దారి సూపు దేవుడు 


ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా 

అందరి తోడునీడై మాయని మమతలా


సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట 

వరముగ చేర యేసు పరమును వీడేనంట

మరువని బంధమై .....


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu