నిబ్బరం కలిగి ధైర్యముగుండు | Nibharam Kaligi Song Telugu Lyrics | Download

నిబ్బరం కలిగి ధైర్యముగుండు | Nibharam Kaligi Song Telugu Lyrics | Download 

నిబ్బరం కలిగి ధైర్యముగుండు | Nibharam Kaligi Song Telugu Lyrics | Download  Nibbaram Kaligi dairyamugundu song download Nibbaram Kaligi dairyamugundu song download naa Songs Telugu Christian Songs lyrics

పల్లవి:

నిబ్బరం కలిగి ధైర్యముగుండు

దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)

నిన్ను విడువడు నిన్ను మరువడు 

ప్రభువే నీ తోడు

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము

నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా  ||నిబ్బరం||


చరణం:

1.పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)

ప్రభు కృప మమ్మును విడువడుగా (2)

ఎక్కలేని ఎత్తైన కొండను

ఎక్కించును మా ప్రభు కృప మమ్మును

ప్రభువే మా బలము  ||హల్లెలూయా||


2.మునుపటి కంటెను – అధికపు మేలును (2)

మా ప్రభు మాకు కలిగించును (2)

రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును

శత్రువు ఎదుటనే భోజనమిచ్చును

ప్రభువే మా ధ్వజము  ||హల్లెలూయా||


3.మా అంగలార్పును – నాట్యముగా మార్చెను

బూడిద బదులు సంతోషమిచ్చెను (2)

దుఃఖ దినములు సమాప్తమాయెను

ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను

ప్రభునకే స్తోత్రం  ||హల్లెలూయా||


4.స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2)

మా ప్రభు మమ్మును మరువడుగా (2)

చూడుము నా అరచేతిలనే

చెక్కితి నిను అన్నాడు ప్రభువు

ప్రభువే చూచుకొనును  ||హల్లెలూయా||


5.రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2)

మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)

ఇదిగో నేనొక నూతన క్రియను

చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను

ఇప్పుడే అది మొలుచున్  ||హల్లెలూయా||


6.మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2)

మా ప్రభు మాకు అందించును (2)

ప్రాకారముగల పట్టణములోనికి

ప్రభువే మమ్మును నడిపింపచేయును

ప్రభువే మా పురము   ||హల్లెలూయా||


Download Pdf

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu