నా ఏలినవాడా నాకై ప్రాణము పెట్టిన | Naa elinavada nakai pranamu pettina | Christian Song Lyrics
నా ఏలినవాడా నాకై ప్రాణము పెట్టిన | Naa elinavada nakai pranamu pettina | Christian Song Lyrics - Download
నా ఏలినవాడా నాకై ప్రాణము పెట్టిన
ఎలా నిన్ను కీర్తించాలో ఎలా నిన్ను కొనియాడాలో
ఊహకే అందకున్నది నా యేసయ్యా (2)
నా ఏలినవాడా నాకై ప్రాణము పెట్టిన నీ ప్రేమ వర్ణింప మాటలే లేవయ్యా
నా ఏలినవాడా మరణము గెలిచి లేచిన నీ ప్రేమను కొలువ కొలతలే లేవయ్యా
1. ఎండిన మోడులాంటి జీవితాన్ని నే కలిగి
సారమే లేని భూమి గా మిగిలిన వేళలో (2)
నన్ను దరి చేర్చినావు నీటి బుగ్గగా మార్చినావు (2)
నీ మందిరాన ఒలీవ మొక్కవలె నాటావు
నా ఏలినవాడా నా నిత్యజీవజలమా నీ ప్రేమ వర్ణింప మాటలే లేవయ్యా
నా ఏలినవాడా నాకు జీవమునిచ్చిన నీ ప్రేమను కొలువ కొలతలే లేవయ్యా (ఎలా)
2. గమ్యమే కనుగొనలేని జీవితాన్ని నే కలిగి
నిలువలేక ఓడిపోయి విలువ లేని వేళలో (2)
నీ రక్తమే కార్చినావు నాకు విలువను ఇచ్చినావు (2)
అక్షయ కిరీటమే గమ్యముగ చేశావు
నా ఏలినవాడా నా నిత్యస్వాస్థ్యమా నీ ప్రేమ వర్ణింప మాటలే లేవయ్యా
నా ఏలినవాడా నాకు మహిమను ఇచ్చినా నీ ప్రేమను కొలువ కొలతలే లేవయ్యా (ఎలా)
నా ఏలినవాడా నా యజమానుడా నీ నామమునే సన్నుతించెద
నా ఏలినవాడా నా యజమానుడా నీ కార్యములను ఘనపరచెద
నా ఏలినవాడా నా యజమానుడా నీ బాహుబలమును నే కీర్తించెద
నా ఏలినవాడా నా యజమానుడా నీ వాత్సల్యమును నే కొనియాడెద
నా ఏలినవాడా నా యజమానుడా నీ త్యాగమునకై సాక్షిగా జీవించెద
నా ఏలినవాడా నా ఆశ్రయదుర్గమా నీ ప్రేమ ప్రకటింప జీవితమర్పించేదా
