మరియా తనయుడై | MARIYA THANAYUDAI | Christmas Song Lyrics Telugu
మరియా తనయుడై | MARIYA THANAYUDAI | Christmas Song Lyrics Telugu - Download
మరియా తనయుడై
మరియా తనయుడై - మనుజావతారుడై
మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను
"ఆనందమానందమే - లోకానికి శుభదినమే
ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే"
1. ఒక దూత తెలిపెను - గొల్లలకు శుభవార్తను
ఒక తార వెలిసెను - రారాజుని ప్రకటించెను ||ఆనంద||
2. బెత్లెహేము పురములో - దావీదు వంశంబులో
రక్షకుడు వెలసెను - మన పాపము తొలగించెను ||ఆనంద||
3. రాజులకే రాజుగా - ప్రభువులకే ప్రభువుగా
ఇమ్మానుయేలుగ - యేసయ్య జన్మించెగ ||ఆనంద||
