ఓ తార వెలిసింది ఆ నింగిలో | O Thara Velisindi Aa Ningilo | Christmas Song Lyrics Telugu
ఓ తార వెలిసింది ఆ నింగిలో | O Thara Velisindi Aa Ningilo | Christmas Song Lyrics Telugu
ఓ తార వెలిసింది ఆ నింగిలో
ఓ తార వెలిసింది ఆ నింగిలో
జగమంతా సంబరమే నీ రాకతో
మరియమ్మ గర్భాన్న మెస్సియ్య జన్మించే
పశుశాలలోన యేసయ్య పవళించే (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ((ఓ తార))
1. ఆ గొర్రెల కాపరులు మంద కాయుచున్నగా
గాబ్రియేలు దర్శనమిచ్చి శుభవార్త తెల్పగా (2)
మందనే విడిచారు ప్రభు చెంత చేరారు
పాపాన్ని తొలిగించే రక్షకుడని చాటారు (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ((ఓ తార))
2. గగనాన ఓ తారా రక్షకుడి గుర్తని
జ్ఞానులే తెలిపారు తార వెంట నడిచారు (2)
పరమాత్ముని దర్శించి కానుకలను అర్పించి
మార్గాన్ని మలచుకొని సాక్షిగా బ్రతికారు (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ((ఓ తార))