యెహోవా నా దేవా నీ దయలో కాయుమా | Yehova Naa Deva | Telugu Christian Song Lyrics
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా | Yehova Naa Deva | Telugu Christian Song Lyrics - Download
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే (2) ..యెహోవా....
1. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
2. నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా
3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)...
పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....
