పరలోక మహిమను వీడిన | Naalona Ye Manchi Chusavaya | Jesus song Lyrics Telugu
పరలోక మహిమను వీడిన | Naalona Ye Manchi Chusavaya | Jesus Lyrics Telugu
పరలోక మహిమను వీడిన
పరలోక మహిమను వీడిన - పరమ తండ్రి తనయుడా
పరమును చేర్చగ నా కొరకై - భువికేతెంచిన పావనుడా
నిస్వార్థమైన ప్రేమ నీదయా - ప్రధాన పాపిని నేనయా
ఏ గమ్యమే లేని పరుగు నాదయా - నా గురి నీవైతివి యేసయ్యా
నాలోన ఏమంచి చూసావాయా - నీ రక్తమే కార్చి కొన్నావయ్యా
నాలోన ఏమంచి చూసావాయా - నీ సాక్షిగా నన్ను మార్చావయ్యా
నిను కాదని నే తప్పిపోయినా - నను వెదకి వచ్చిన్న నిజకాపరి
పాపమును విత్తుతూ జీవించినా - పరిశుద్ధ పరిచిన పరిహారి
నీ విధేయతే నా రక్షణార్థము - నీదు మరణమే నా జీవమార్గము
నీ రూపమే నాలో కోల్పోయినా - నీ చేయి చాపిన సహకారి
ఈ లోకముతో నేను స్నేహించినా - ప్రత్యేక పరచిన ఉపకారి
నిత్య జీవమే నీ నీతి దానము - శిలువ త్యాగమే నీ పుణ్య కార్యము
