జనించెను నేడే రక్షకుడేసు తల్లి మరియ గర్భమున పశువుల పాకలో | janinchenu nedey rakshakudesu thalli mariya garbhamuna pashuvula paakalo | Telugu Christian song lyrics

జనించెను నేడే రక్షకుడేసు   తల్లి మరియ గర్భమున పశువుల పాకలో | janinchenu nedey rakshakudesu thalli mariya garbhamuna pashuvula paakalo | Telugu Christian song lyrics

ఇదిగో శుభదినం మనమానందించేదం ప్రభువుని జననమూ.... దేవుడే దీనుడై అవతరించె భువిపై మనుజరూపుడై....

జనించెను నేడే రక్షకుడేసు 

తల్లి మరియ గర్భమున పశువుల పాకలో 

ఆ చల్లని రాత్రి గొఱ్ఱెల కాపరులు

దూత వర్తమానముచే ఆయనను కనుగొనిరి

సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానముచేసెదము

దేవాది దేవుడు మనకొరకే జనియించే||2||


1)తూర్పు దేశపు జ్ఞానులకు తార చూపెను మార్గమునే 

వెదకి వచ్చి పూజించితిరి బంగారు సాంబ్రాణి బోళముతో 

సత్యవాక్యమై వెలిసెనుగా మనకు మార్గమూ చూపుటకూ 

దేవదేవుని జననమును కీర్తించి చాటేదమూ 

నింగీ నేలా కొనియాడి పాడెనులే

సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదము దేవాది దేవుడు మనకొరకే జనియించే||2||


2)దేవుడే ఈ లోకమును ఎంతగానో ప్రేమించెనులే 

అందుకే మనకొరకై ఏతెంచె ఈ భువిపై

 విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొందుటకూ 

ఉచితముగా ఇచ్చెనులే ఆ గొప్ప రక్షణను

నేడే మనకూ అత్యంత శుభదినమూ

సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదము దేవాది దేవుడు మనకొరకే జనియించే||2||


జనించెనునేడే రక్షకుడేసు

తల్లి మరియ గర్భమున పశువుల పాకలో 

ఆ చల్లని రాత్రి గొఱ్ఱెల కాపరులు

దూత వర్తమానముచే ఆయనను కనుగొనిరి

సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదము దేవాది దేవుడు మనకొరకే జనియించే ||2||

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu