అహా ఆహా ఎంతో ఆనందమే | Aaha Aaha Santhoshame | Telugu Christian Song Lyrics
అహా ఆహా ఎంతో ఆనందమే | Aaha Aaha Santhoshame | Telugu Christian Song Lyrics - Download
అహా ఆహా ఎంతో ఆనందమే
పల్లవి:
అహా ఆహా ఎంతో ఆనందమే
ఓహో ఓహో ఎంతో సంతోషమే ||2||
మహరాజు జన్మించాడులే
మహిమలెన్నో తెచ్చాడులే ||2||
మనకింక సంబరాలే
తాకుతాయి అంబరాన్నె
మోగుతాయి సంగీతాలే ||2|| ||అహా ఆహా||
చరణం:
1. కన్యమరియయే గర్భమందునే
గొప్ప శ్రీమంతుడును కనెను
సృష్టికర్తయే లోక రక్షకుడై
ఈ జగాన ఉదయించెను ||2||
పాపులకే రక్షణ ఇచ్చెనే
పరమునకే మార్గం చూపెనే
రోగులకే స్వస్థత వచ్చెనే
మృతులనే లేపబడెనే ||మనకింక||
2. ఈ ధరణియే ప్రభుకి శరణయే
తరియించి పులకించెను
పరవసులమై క్రీస్తు జన్మము
కీర్తించి పాడెదము ||2||
లోకానికి వార్త వచ్చెనే
మానవాళికి శుభములు తెచ్చెనే
నింగి నేలకే పండగ వచ్చెనే
ప్రకృతియే కళకళలాడెనే ||మనకింక||
