శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు | Sri Yesu Janminchinaadu | Christmas Song Lyrics Telugu
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు | Sri Yesu Janminchinaadu | Christmas Song Lyrics Telugu - Download
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన ((2))
ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు ((2))
ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము ((2)) ((ఓ అయ్యా))
పాపాలకు, మన లోపలకు - ఇఁక చెల్లి పోయింది కాలము
మనలోన చీకటి, తొలగించగా - నేడు తెచ్చాడు మనకై తన తేజము ((2))
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు ((2)) ((ఓ అయ్యా))
మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము ((2))
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు ((2)) ((ఓ అయ్యా))
